Sunday, 15 April 2012


వివేకానంద వారసులకు ఆహ్వానం..

ఇక్కడెవరూ సమాజం పట్ల మొసలి కన్నీరు కార్చరు.. సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తారు!

తమంతట తాము ప్రతీదీ బాధ్యతగా చేయడం ద్వారా మరికొంత మంది అదే మార్గంలో నడిచేలా చేస్తారు.

సమాజాన్నీ, మనుషుల్నీ తిట్టుకుని నిద్రపోవడం కాదు..

మన ప్రవర్తనలో చిన్న మార్పుతో అయినా అదే సమాజంలోని మన తోటి వ్యక్తికి ఆదర్శంగా నిలవాలనుకునే వారందరి కోసం ఓ వేదిక తయారవబోతోంది.

టివిల కన్నా దారుణంగా వర్చ్యువల్ ప్రపంచంలో నెగిటివ్ వైబ్రేషన్లు పసి హృదయాల్ని తప్పుదారి పట్టిస్తుంటే ఏదైనా చేయాలి అన్న సంఘర్షణలో ఉండగా..

అదే సమయంలో ఈరోజు మధ్యాహ్నం సింగపూర్ నుండి ఓ ఫేస్ బుక్ మిత్రుడు ఫోన్ చేశారు.. సరిగ్గా ఇదే మాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎక్కడెక్కడో ఉన్న మనమంతా ఎందుకు మంచి పని కోసం కలవకూడదు?

మనకు అందుబాటులో ఉన్న వాయిస్, వీడియో ఛాటింగ్ ల ద్వారా గ్రూప్ గా సమాజం పట్ల కల్లబొల్లి కబుర్లతో సరిపెట్టుకోకుండా నిఖార్సయిన బాధ్యత కలిగిన కొద్దిమందైనా తరచూ మీటింగులు జరుపుకుంటూ ఎంతో కొంత పాజిటివ్ వైబ్రేషన్లని సమిష్టిగా ఎందుకు మన సమాజంలోకి తీసుకువెళ్లలేం.. అన్న ఆలోచన నుండి ఓ వేదిక త్వరలో కార్యరూపం దాల్చనుంది.

దీనిలో ఎవరైనా పాలుపంచుకోవచ్చు.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున విషెస్ చెప్పేసుకుని దేశభక్తిని చాక్లెట్ తిని మూతి తుడుచుకున్నంత ఈజీగా మర్చిపోయే బాపతు జనాలకు కాదు ఈ వేదిక.

స్వామీ వివేకానంద కలలు కన్న భారతదేశానికీ, యువతరానికీ ప్రాతినిధ్యం వహించే వారందరం కలుద్దాం. ఏం చేయాలో, ఏం చేయొచ్చో ఆలోచిద్దాం, ఆచరణలో చూపుదాం.

ఈ వేదిక ఎలాగుంటే బాగుంటుంది అన్న విషయంపై మొదలుకుని అన్ని అంశాలపై మీ అభిప్రాయాలూ దయచేసి పంచుకోండి, అలాగే దీని గురించి మీ మిత్రులకూ తెలియజేయండి. సమాజం మారుతుందో లేదో పక్కనబెట్టి మనమూ, మన పక్కవాళ్లమూ మారదాం. ఫలితాలు ప్రాక్టికల్ గా చూద్దాం.

No comments:

Post a Comment